Development Works Starts in AP Capital Amaravati: వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని అమరావతిలో పడకేసిన వివిధ సంస్థల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మిస్తున్న పనుల్లో పురోగతి కనిపిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఫోరెన్సిక్ ప్రయోగశాల పనులు ఊపందుకున్నాయి. ఇదే తరహాలో అమరావతిలో భూములు తీసుకున్న సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.