Ex Minister Jagadish Reddy Comments on Power Sector : విద్యుత్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఇలాగే చేస్తే, రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థకు వచ్చే సబ్సిడీలు ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఈ నిర్ణయం జరిగిందని ఆరోపించిన జగదీశ్ రెడ్డి, కరెంటు బిల్లుల వసూలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వెల్లడించారు. <br />
