CM Chandrababu Serious on Minister Wife Issue: పోలీసులతో మంత్రి రామ్‌ప్రసాద్ సతీమణి ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో హరిత మాట్లాడిన తీరును తప్పుపట్టిన సీఎం, మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరణ కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించనని తెలిపారు.