Amaravati ORR Updates : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి దశ తిరుగుతోంది. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు సహా కీలక ప్రాజెక్టులున్నాయి. వీటిని 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేపట్టి, కొంత ముందుకు తీసుకెళ్లాక, జగన్ సర్కార్ అటకెక్కించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నిటినీ మళ్లీ కేంద్రం ముందుంచి, ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు.