Red Sandalwood Trafficking: నేరస్థులను కటకటాల్లోకి నెడితేనైనా సత్ప్రవర్తనతో తిరిగి వస్తారనుకుంటే అదే జైలును భారీ స్కెచ్‌లకు అడ్డాగా మార్చుకుని నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ఆ ఎర్రచందనం స్మగ్లర్లు. కడప జైల్లో ఏడాదిగా శిక్ష అనుభవిస్తున్న నలుగులు స్మగ్లర్లు అక్కడి నుంచే తమ అనుచరులతో ఎర్రచందనం తరలిస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల పోట్లదుర్తిలో పట్టుబడిన ఎర్రచందనం తరలింపు వెనుక వారి హస్తం ఉందని అటవీశాఖ అధికారులు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు నివేదిక అందజేశారు.
