CM Revanth Reddy Mahabubnagar Tour : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఉమ్మడి పాలమూరులో నేడు పర్యటించనున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల తర్వాత తొలిసారిగా మహబూబ్‌నగర్‌కి రానున్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాగునీటి రంగంలో ప్రాజెక్టుల పూర్తి, విద్య, వైద్యం, పర్యాటకం సహా కీలకమైన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.