Surprise Me!

అర్హులకే రైతు భరోసా : మంత్రవర్గ ఉపసంఘం

2024-07-10 239 Dailymotion

Rythu Bharosa Workshop in Khammam District : రాష్ట్రవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, ఇతర అన్ని వర్గాల సలహాలు, సూచనలు రైతు భరోసా పథకం అమలుపై స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేదికగా తొలి కార్యశాల నిర్వహించింది. విధివిధానాల అమలుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్​, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్​లో అభిప్రాయాలు సేకరించారు. <br /><br />ఈ సమావేశంలో మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 500 మంది రైతులు హాజరయ్యారు. రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వివిధ రంగాలకు చెందిన బాధ్యులు హాజరయ్యారు.

Buy Now on CodeCanyon