Surprise Me!

హైదరాబాద్​లో రెచ్చిపోతున్న మాదకద్రవ్యాల స్మగ్లర్లు

2024-07-11 92 Dailymotion

Hyderabad Police Raids In Pubs : బెంగళూరు నుంచి సింథటిక్‌ డ్రగ్స్‌ ఆంధ్రా ఒడిషా సరిహద్దుల నుంచి గంజాయి రాజస్థాన్‌ నుంచి ఓపీయం, అమెరికా నుంచి ఓజీ అలా హైదరాబాద్‌ని అడ్డాగా చేసుకొని మాదకద్రవ్యాల స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలని వేదికగా చేసుకొని యథేచ్ఛగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల వ్యవధిలోనే కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యనగరంలోని పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, పార్టీల్లో మత్తు తప్పనిసరిగా మారింది. నగరాన్ని కమ్మేస్తున్న ఆ మత్తుభూతాన్ని భూస్థాపితం చేసే లక్ష్యంతో టీజీన్యాబ్‌ కఠిన చర్యలకి సిద్ధమైంది.

Buy Now on CodeCanyon