Telangana Budget 2024 -2025 : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 25 లేదా 27న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, రాష్ట్రానికి కేటాయింపుల ఆధారంగా బడ్జెట్లో సవరణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్లో సంక్షేమ పథకాలకే ఎక్కువ శాతం కేటాయింపులు చేయనున్నారు.