వైఎస్సార్సీపీ పాలనలో భ్రష్టుపట్టిన తాగునీటి ప్రాజెక్టులను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా, వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో తాగునీటి ప్రాజెక్టులకు రుణ సాయం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ పనులను ప్రపంచ బ్యాంకు సాయంతో పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.