Robbery In Hyderabad Vijayawada Highway : హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి. రెండు నెలలు నుంచి ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు, శివారు ప్రాంతాల్లో నివసించే వారు భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలో జాతీయ రహదారిపై జరుగుతున్న చోరీలపైన పోలీసులు దృష్టి సారించారు. నిఘా పెంచి నిందితులకు చెక్ పెడుతున్నారు.
