INTERNATIONAL DRUGS SYNDICATE : ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింకును తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు. నార్సింగి పోలీసులతో కలిసి గుట్టురట్టు చేశారు. నైజీరియాలోని డ్రగ్ డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచూ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లోని స్థానిక పెడ్లర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. శివారు ప్రాంతమైన నార్సింగిలోని ఒక ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు.. నైజీరియాకు చెందిన ఇద్దరు డ్రగ్ డీలర్లు, కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముగ్గుర్ని అరెస్టు చేశారు