Surprise Me!

సెల్ఫీ వీడియో తీసుకొని దంపతుల ఆత్మహత్య

2024-07-16 152 Dailymotion

Couple Commits Suicide in Nizamabad : రైలు కింద పడి దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్-మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరిగౌడ్, గ్రామస్థుల కథనం ప్రకారం, పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన భార్య, భర్తలు అనిల్ (28), శైలజ(24)కు ఏడాది కిందట వివాహమైంది. ఓ ఇంటర్వ్యూకు వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి బయటకు వచ్చారు. అనంతరం బంధువుల వేధింపులు భరించలేక తాము గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్సై సందీప్ కు పంపారు. సదరు ఎస్సై నవీపేట ఎస్సైకి వీడియోతో పాటు వారి చరవాణి నంబరు పంపారు. భార్య, భర్త ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు బాసర గోదావరికి వస్తున్నట్లు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటినా బాసర వంతెన వద్ద వారి కోసం గాలించగా వారు కనిపించలేదు. బాధితుల చరవాణి నంబరు ట్రాక్ చేయగా ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య ఉన్నట్లు నవీపేట ఎస్సై గుర్తించి అక్కడకు వెళ్లి గాలించగా ఇద్దరి మృతదేహాలు పట్టాలపై ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు రైల్వే పోలీసులకు సమాచారం అందించినట్లు ఎస్సై తెలిపారు.

Buy Now on CodeCanyon