Surprise Me!

'వర్షాన్ని లెక్కచేయకుండా వాగులు వంకలు దాటుతూ వైద్య సేవలు'

2024-07-17 8 Dailymotion

Doctors Provided Medical Services : వైద్యో నారాయణో హరిః వైద్యుడు భగవంతుడితో సమానం అంటారు. ఈ మాట మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన సమాజం డాక్టర్లను గౌరవంగా చూస్తారు. ఆ పేరుకు తగ్గట్లుగానే ములుగు జిల్లా వైద్యులు చేసిన పని ఇప్పుడు సమాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ములుగు జిల్లా పెనుగోలు గ్రామంలోని ప్రజలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామంలో ఇప్పటికే రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. పైగా ఆ గ్రామం నుంచి రావాలంటే వర్షాలు అడ్డంకింగా మారాయి. దీంతో గ్రామస్థుల దగ్గరికే వైద్యులు వెళ్లారు. అందుకోసం కాలినడకన కొండలూ గుట్టలు దాటి కుండపోతగా కురిసే వర్షంలో తడస్తూ, ప్రమాదకరమని తెలిసినా లెక్క చేయక వాగులు దాటి వైద్య సేవలందించి సెహబాష్ అనిపించుకుంటున్నారు.

Buy Now on CodeCanyon