Kickboxer attack on electricity staff : కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై ఓ వ్యక్తి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తీవ్రంగా గాయపడిన కరెంటు సిబ్బందిని తోటి సిబ్బంది స్థానికులు కలిసి ఈఎస్ఐసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యుత్ ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.<br /><br /> విద్యుత్ సంఘ నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హెచ్.శ్రీకాంత్, మీటర్ రీడర్ సాయి గణేశ్ ఉదయం మోతీనగర్ మీటర్ రీడింగ్‌కు వెళ్లారు. మోతీనగర్‌లోని రాముల పేరిట ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయి రూ.9,858 చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు వచ్చి బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకొండని దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఎంసీబీ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
