Heavy Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల చెరువులు, వాగులు ప్రమాదకరంగా మారాయి. భూపాలపల్లి జిల్లాలో వాగు ఉప్పొంగడంతో బొలేరో వాహనం కొట్టుకుపోయింది.
