CM Chandrababu Naidu Comments on YS Jagan: ప్రజలు ఛీకొట్టినా జగన్ మారలేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉనికి కోసమే హత్యా రాజకీయాలని ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని టీడీపీపీ భేటీలో తేల్చిచెప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు హింసకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో జగన్ చేస్తున్న ఫేక్ పాలిటిక్స్‌ని మంత్రులు, ఎంపీలు, నేతలు వెంటనే బలంగా తిప్పికొట్టాలని సూచించారు.
