Streams Overflow Due To Rains : మూడు రోజులుగా తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు, చలివాగు, మానేరు వాగులు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టేకుమట్ల మండల కేంద్రంలోని పలు గ్రామాల మధ్య తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్లు కొట్టుకపోయాయి.
