Road Damage Due To Heavy Rains in Jagtial : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు చేరింది. జగిత్యాల జిల్లాలో ఓ వాగుపై ఉన్న రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
