Boy Video Message on Road Problem : ఆడుకునే వయసులో అభివృద్ధి కోసం అర్జీ చేశాడు ఓ బాలుడు. అది కూడా ఎవరికో సాదాసీదా వ్యక్తికి కాదు. ఏకంగా ముఖ్యమంత్రికే సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను విన్నవించాడు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు గుంతలుగా మారిన తమ డివిజన్లో రోడ్లను బాగు చేయాలంటూ, ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య అంటూ• ముఖ్యమంత్రిని వేడుకున్నాడు. ఆ బాలుడు వేడుకోలు వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.<br />