Komaram Bheem Project Cracks : జోరు వర్షాలతో ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతుంటే సంతోషం వెల్లివిరిస్తుంది. అయితే ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఏ ముప్పు ముంచుకొస్తుందనే భయం వెంటాడుతోంది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమురం భీం ప్రాజెక్టు పరిస్థితి ఇది. ఆనకట్ట కుంగిపోయి రెండేళ్లు గడిచినా మరమ్మతులు చేయక టార్పాలిన్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. జనరేటర్లతో నిర్వహణను నెట్టుకొస్తున్న అధికారులు వరద పోటెత్తితే ఎలా బయటపడాలనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు.
