Surprise Me!

నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు - సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్

2024-07-23 30 Dailymotion

హామీల అమలు, ప్రజాసమస్యలను లేవనెత్తడం ద్వారా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రధాన ప్రతిపక్షం భారాస సిద్ధమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీలు... వాటి అమలులో వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తిచూపాలని భావిస్తోంది. సంక్షేమం, అభివృద్ధిలో లోపాలు... పార్టీ ఫిరాయింపుల అంశం ఆధారంగా సర్కార్‌ను ఇరుకున పెట్టాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, కార్యాచరణపై ఇవాళ జరగనున్న పార్టీ శాసనసభా పక్షంలో అధినేత కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Buy Now on CodeCanyon