MLA Tellam Venkat Rao Do Deliveries to Pregnant Women : వైద్యో నారాయణ హరి వైద్యుడు దేవుడితో సమానం అంటారు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు గర్భిణీలకు అత్యవసరంగా కాన్పు చేయాల్సి రావడంతో నేనున్నాంటూ రంగంలోకి దిగి పురుడుపోసి వైద్య వృత్తికి ఆదర్శంగా నిలిచారు.
