Debate On Telangana RTC Merge in Govt 2024 : శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్‌సీ బకాయిల గురించి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలపై పొన్నం ప్రభాకర్ ఎదురుదాడి చేశారు.