Ashwini Vaishnaw on Funds Allocate to AP Railway: ఏపీలో రైల్వేలకు ఈ ఏడాది 9,151 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. అమరావతి, విజయవాడ రైల్వేస్టేషన్ల అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.