25th Kargil Vijay Diwas Celebrations : రాష్ట్రవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ సాగర తీరంలో తూర్పు నౌకాదళం అధికారులు విజయోత్సవాలను నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులు అర్పించారు. అలాగే దేశాన్ని రక్షించడానికి సాహసోపేతంగా పోరాడిన భారత సాయుధ బలగాల త్యాగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. సైనికులకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు.
