Government Students Facing Problems : ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 695 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, అందుకు తగ్గట్లుగా వసతులు లేకపోవడంతో విద్యార్థుల చదవులకు ఆటంకం ఏర్పడుతుంది. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.