BJP Payal Shankar on State Budget 2024 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కల గారడిలాగా ఉందని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ఎద్దేవా చేశారు. అందమైన పెద్ద పెద్ద పదాలు, అంకెలతో బడ్జెట్ తయారు చేశారని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి తెలంగాణకు బడ్జెట్‌లో నిధులు రాలేదని విమర్శలు చేయడం బాధాకరమన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పదం ఉచ్చరించలేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర బడ్జెట్‌లో ఏ ఏ జిల్లాల పేర్లను పలికారో చెప్పాలని డిమాండ్ చేశారు.
