Kunamneni Fires On Harish Rao : మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో తాను మాట్లాడుతున్నప్పుడే హరీశ్‌రావుకు అన్నీ గుర్తుకొస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న కూనంనేని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయదని భావిస్తున్నామన్నారు.