Bapatla People Facing Difficulties as Dogs and Cows : కుక్క పేరు చెబితే విశ్వాసానికి ప్రతీక అని అంటారు. ఆవుని దైవంతో కొలుస్తారు. అయితే ఇవే జంతువులు బాపట్లలోని ప్రజలకు, వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాత్రి వేళాల్లో రోడ్లపైకి రావలంటే వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. కొన్నిసార్లు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్నాయి. వీటి బారిన పడి చాలా మంది గాయపడ్డారు. సమస్య పరిష్కారించాలని స్థానికులు అధికారుల వద్ద మెుర పెట్టుకున్న స్పందన కరువైంది.