Lanka People Suffering From Godavari Floods: గోదావరి వరద మళ్లీ పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. భారీగా వరద రాకతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గ్రామాలు, మెట్టపంటలు వరద నీటిలోనే నానుతున్నాయి. లంక గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పడవలను ఏర్పాటు చేశారు.