Minister Seethakka On Podu Lands : శాసనసభ సమావేశాలు ఇవాళ ఉదయం ప్రారంభమయ్యాయి. వివిధ 19 పద్దులపై శాసనసభలో జర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్క తండ్రికి పోడు భూముల పట్టా ఇచ్చామన్నారు. అనిల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు.