Aqua Farmers Problems: ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలతో శ్రీకాకుళం జిల్లాలో ఆక్వా రంగం కుదేలైంది. ఒకప్పుడు రైతులకు కాసులు కురిపించిన రొయ్యల చెరువులు ప్రస్తుతం ఎడారిగా మారి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఐదేళ్లుగా ఆక్వా రైతుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు లేకపోవడంతో పాటు స్థిరమైన మార్కెటింగ్ లేక నష్టపోయామంటూ ఆక్వా రైతులు ఆవేదన చెందుతున్నారు. తీసుకున్న అప్పులు తీర్చలేక ఉన్న పొలాలను అమ్ముకొని పొట్ట కూటి కోసం వలస బాట పడుతున్నారు.