One More international stadium in Hyderabad : హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీ సమీపంలో బ్యాగరికంచెలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించినట్లు ఆయన తెలిపారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ.321 కోట్లు కేటాయించామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని వెల్లడించారు