CM Revanth Reddy USA Tour : రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లింది. ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్‌ను సందర్శించనున్నారు. ఎనిమిది రోజుల అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో సీఎం బృందం పర్యటిస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు.