Telugu Women In BRICS Summit Russia : ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతోన్న ఓ లారీ డ్రైవర్ కుటుంబంలో పుట్టిందా యువతి. తనకంటే ముందు పుట్టిన ఇద్దరు అక్కలకే చదువుకోవడం కష్టామవుతోంటే ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యభ్యాసం చేసింది. పరిశోధనలే లక్ష్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరింది. ప్రతిభతో ఇటీవల జరిగిన బ్రిక్స్ దేశాల యూత్ సమ్మిట్ పాల్గొని అందరి ప్రశంసలందుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక తెలుగమ్మాయిగానూ నిలిచింది విశాఖకు చెందిన అయేషా.
