Surprise Me!

మెదక్​ ఆర్ఆర్​ఆర్ సర్వే​ వివాదం - మళ్లీ వెనుదిరిగిన అధికారులు - ఊపిరి పీల్చుకున్న రైతులు

2024-08-03 102 Dailymotion

Locals Blocked the Regional Ring Road Survey in Medak : ప్రాంతీయ రింగు రోడ్డు సర్వేను మెదక్‌ జిల్లాలో రైతులు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో సర్వే చేయడానికి వచ్చిన అధికారులు, సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. రెడ్డిపల్లి, చిన్నచింతకుంట వద్ద ఆర్‌ఆర్‌ఆర్‌ సర్వేను చేయనీయకుండా రైతులు ఆర్డీవో, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. కాళేశ్వరం కాలువ, ఛత్తీస్‌గడ్‌ విద్యుత్తు లైన్, 132 కేవీ లైన్, కొండపోచమ్మ సాగర్ చిన్న కాలువ కోసం ఇప్పటికే భూములు ఇచ్చామన్న రైతులు, ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూములు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు సర్వేకు ఒప్పుకోలేదు.

Buy Now on CodeCanyon