Eenadu Golden Jubilee Celebrations : విజయం ఒక గమ్యం కాదు, ఒక అనంత యాత్ర! ఈనాడు 50 ఏళ్ల మజిలీ కూడా అంతే! కళింగనేలపై పుట్టి, తెలుగువారి మేలుకొలుపైంది. అంచనాలు లేకుండా సంచనాలు సృష్టిస్తూ ఈనాడు జైత్రయాత్ర సాగిపోతోంది! ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉన్నచోట, రెండో తెలుగు ఎడిషన్ ప్రారంభించడం ఏడాది వయసులోనే ఈనాడు చేసిన సాహసం! ఆ తర్వాత తెలుగు నేల నలుచెరుగులా వేళ్లూనుకోవడం, రాష్ట్రం దాటి తెలుగువారు ఎక్కడుంటే అక్కడి వరకూ వెళ్లడం అసమాన్య విజయం! ఏ పత్రికకూ లేని బలం, బలగం ఈనాడు సొంతం! అందుకే సర్క్యులేషన్‌లో ఈనాడుది ఎవరూ అందుకోలేని అగ్రపీఠం.