Palvancha Thermal Plant Cooling Towers Demolished Video : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు తొలగించారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎగ్జిక్యూట్ అనే ప్రైవేట్ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. ఓఎంఎం కర్మాగారం మూతపడడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
