Surprise Me!

మూడు నెలల్లో భూముల రీసర్వే సమస్యల పరిష్కారం

2024-08-08 3 Dailymotion

Andhra Pradesh Cabinet Meeting : జగన్‌ పాలనలో జరిగిన భూముల రీసర్వే వల్ల తలెత్తిన సమస్యలు, వివాదాల్ని గ్రామ సభలు నిర్వహించి 3 నెలల్లో పరిష్కరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల విధానాల అధ్యయననానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ, తిరుపతిలో భూ వివాదాలపై వినతుల స్వీకరణ, పరిష్కారానికి అధికారుల బృందాల్ని పంపించాలని సూచించారు. జనం పెద్దఎత్తున తన వద్దకు వస్తున్నందున మంత్రులు ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కేంద్రంలో వినతులు స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది.

Buy Now on CodeCanyon