Surprise Me!

మెరుగైన సేవలందించేందుకే జీఐఎస్ సర్వే - జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి క్లారిటీ

2024-08-08 109 Dailymotion

Amrapali On GHMC GIS Survey : హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ చేస్తున్న జీఐఎస్ సర్వే ద్వారా ఎలాంటి ఆస్తి పన్ను పెంపు ఉండదని కమిషనర్ ఆమ్రపాలి స్పష్టం చేశారు. నగరంలో కేవలం భవనాలు, రహదారులు, ఆస్తుల గుర్తింపునకు మాత్రమే ఈ సర్వే చేస్తున్నట్లు పేర్కొన్న ఆమ్రపాలి దేశానికి మోడల్​గా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా ఈ సర్వే చేస్తున్నట్లు వివరించారు. ఈ సర్వే పూర్తయ్యాక ఇంటింటికి డిజిటల్ డోర్ నెంబర్లతోపాటు వంద రకాల సేవలు ఇంటి ముందుకే వస్తాయని వెల్లడించారు. జీఐఎస్ డ్రోన్ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపిన ఆమ్రపాలి సర్వే ఉద్దేశాన్ని తన సొంత అనుభవాలతో వివరించి నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.<br />

Buy Now on CodeCanyon