KTR Comments On Congress Party : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌కు 50 ఏళ్లు తాగునీటి అవసరాలకు సరిపడేలా తమ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు చేశామన్న ఆయన, సుంకిశాల ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
