Minister Tummala Clarity On Loan Waiver : రుణమాఫీ కాని రైతులు అధైర్య పడొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసానిచ్చారు. అధికారులను ఇంటింటికీ పంపించి మరీ కుటుంబ నిర్థారణ చేసి మాఫీ అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాల్లో తప్పులున్న రైతులకు మాత్రమే మాఫీ సొమ్ము పడలేదన్న మంత్రి, తప్పులు సవరిస్తూ దశల వారీగా నిధులు విడుదల చేస్తామని తెలిపారు. విపక్షాలు అధికార దాహంతో రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని వారి మాటలు నమ్మొద్దని కోరారు. <br />