Grama Sabhalu in AP : గ్రామాల సుస్థిర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పల్లెలు మళ్లీ పచ్చగా కళకళలాడేలా స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో నేడు ఒకేసారి 13,326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు. ఉపాధిహామీ పథకం పనులకూ ఆమోదం తీసుకోనున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామసభలో సీఎం చంద్రబాబు పాల్గొననుండగా, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొంటారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలూ గ్రామసభల్లో పాల్గొంటారు.
