TDP Won Macherla Municipality in Palnadu District : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధించటంతో పిన్నెల్లి పాలనకు అడ్డుకట్ట పడింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావటం, ఆపై ఎన్నికల హింస కేసుల్లో పిన్నెల్లి జైలుకు వెళ్లటంతో మాచర్లలో ప్రజా పాలనకు అడుగులు పడ్డాయి. ఇప్పుడు మాచర్ల మున్సిపాలిటీనీ టీడీపీ కైవసం చేసుకుంది.
