CM Revanth in Brahmakumaris program : తన కార్యాచరణను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు ఎంతో కృషి చేస్తున్నామని, రైతులను రుణ విముక్తులను చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఒకే విడతలో రైతులకు రూ.31 వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తున్నామని, దేశంలో ఒకేసారి ఇంత మొత్తంలో రైతులకు రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని వ్యాఖ్యానించారు