Survey for Rythu Runa Mafi : రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. అర్హులై ఉండి మాఫీ అవ్వని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం రైతుభరోసా పంట రుణమాఫీ యాప్ రూపొందించారు. అటు రూ. 2లక్షలు దాటి రుణం వారి నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయశాఖ అనుమతించింది.