Surprise Me!

తిహాడ్​ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవిత

2024-08-27 3 Dailymotion

BRS MLC Kavitha Released from Tihar Jail in Delhi : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం బెయిల్​ మంజూరు కాగా, రాత్రి 09.15 నిమిషాల తర్వాత ఆమె తిహాడ్​ జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక భావోద్వేగానికి ఆమె గురయ్యారు. ఆమెకు సాదరంగా కేటీఆర్​, హరీశ్​ రావు, బీఆర్​ఎస్​ శ్రేణులు స్వాగతం పలికారు. పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ కవిత నినాదం చేశారు. కవితను హత్తుకొని కేటీఆర్​, కవిత భర్త, కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు. తిహాడ్​ జైలు వద్ద బీఆర్​ఎస్​ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. వారిని చూసి ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యాంతమయ్యారు.<br /><br />'పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయం. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. కష్ట సమయంలో మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు. నేను కేసీఆర్‌ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండి దాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే నన్ను జైలుకు పంపారు. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం. మేము పోరాడుతాం నిర్దోషిగా నిరూపించుకుంటా. ప్రజా క్షేత్రంలో మరింత నిబద్ధతతో పనిచేస్తాం. అని ఎమ్మెల్యే కవిత చెప్పారు.

Buy Now on CodeCanyon