Farmers are Worried about Movement of Elephants : పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు గజరాజులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మన్యం, మైదాన ప్రాంతం అన్న తేడా లేకుండా పంటలతోపాటు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 13మంది ఏనుగుల దాడిలో మృతి చెందారు.