YSRCP RAJYA SABHA MPs: జగన్ ఒంటెద్దు పోకడలు, పార్టీలో ఎదురయ్యే అవమానాలు భరించలేక వైఎస్సార్సీపీని వీడేందుకు చాలా మంది ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారు. 11 మంది జట్టుగా ఉన్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో అధికశాతం మంది అతిత్వరలోనే గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ జట్టు అలౌట్ అనే ముమ్మరప్రచారం జోరందుకుంది. వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వారిలో మంచి వ్యక్తిత్వం ఉన్న వారిని మాత్రమే టీడీపీలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనతో ముగ్గురు వెనక్కి తగ్గినట్టు సమాచారం.